కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి హామీ
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; రాష్ట్రానికి కీలకమైన ప్రాణహిత చేవెళ్ల నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర జల వనరులు శాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులతో పాటు ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంకు సూచించారు. ఒక రోజు ఢిల్లీ పర్యటన కోసం వచ్చిన హరిష్ రావు కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర సాగునీటి అవసరాల గురించి వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు చొరవ తీసుకోవాలని ఉమా భారతిని కోరారు.

No comments:
Post a Comment