All meadia

 

Thursday, 9 October 2014

టీడీపీకి షాక్ ఇచ్చిన గ్రేటర్ ఎమ్మెల్యేలు....


తలసానితో పాటు పలువురి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు... 
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; తెలంగాణకు చెందిన  టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీకీ షాక్ ఇచ్చారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,  మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో కలిసిన వారు పార్టీలో చేరేందుకు అంగీకారం తెలిపారు ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ  బంగారు తెలంగాణ నిర్మాణంలో  భాగస్వాములయ్యేందుకే టీఆర్ఎస్ లోకి  చేరుతున్నట్లు  తెలిపారు. హైదరాబాద్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చేయడంలో కేసీఆర్ కు అండగా ఉంటామన్నారు. కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల అన్నారు. బంగారు తెలంగాణ  కావాలని కోరుకుంటున్నామని  వారు అన్నారు. 

No comments:

Post a Comment