తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; మా హైదరాబాద్ ఆధ్వర్యంలో జుడిషియల్ ఎంక్వయిరీ పేరుతో సమావేశాన్ని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. లండన్ రాయల్ హిస్టోరికల్ సొసైటి మెంబర్ లింగాల పాండు రంగా రెడ్డి మాట్లాడుతూ మెట్రో రైలు పనుల నిమిత్తం 1325 ఎకరాల భూమిని కేటాయించారన్నారు. అయితే ఇందులో మెట్రో పనుల నిమిత్తం 269 ఎకరాల భూమిని మాత్రమే ఉపయోగించారన్నారు. పంజాగుట్టలో ఎకరం, ఎర్రమంజిల్ లో మూడు ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందన్నారు. వీటిని వెంటనే ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేయాలని ప్రశ్నించారు. 1325 ఎకరాల భూమిని కేటాయిస్తే, అందులో 269 మాత్రమే ఉపయోగించారు... మిగతాది ఎక్కడుంది అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ ధర్మసనం, డిపి రెడ్డి, షానక్వాయ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment