సమావేశంలో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తదితరులు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఆడపిల్ల చదువు ప్రపంచానికి వెలుగని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగిన భైక్ థాన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని తెలిపారు. ఇప్పటికే దేశంలో వరకట్న వేధింపులు జరుగుతున్నాయన్నారు. ఇది దురదృష్టకరమని తెలిపారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు ఎప్పుడు పెళ్లి చేద్దామనే ఆలోచనలతో ఉంటున్నారన్నారు. ఆడపిల్లలను ఎంత భాగా చదివిస్తే మన దేశం అంత అభివృద్ది చెందుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా భైక్ ర్యాలీని ప్రారంభించారు.
సమాజంలో మార్పు ఎంతో అవసరమని బాలల హక్కుల కమీషన్ సభ్యులు అచ్చుత్ రావు, రహీముద్దిన్ మమత రఘువీర్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment