మరో రెండు సంవత్సరాలలో మన దేశం అగ్ర స్థానం నిలిచే అవకాశం; మురళీధర్ రావు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఆధునిక టెక్నాలజి రంగంలో సోషల్ మీడియాను ఉపయోగించడంలో మరో రెండు మూడు సంవత్సరాలలో మన దేశం అగ్ర స్థానానికి చేరుతుందని బీజేపీ కేంద్ర మంత్రి పి.మురళీధర్ రావు అన్నారు. శనివారం లకిడికపూల్ లోని రెడ్ హిల్స్ ఫ్యాప్సీలో సోషల్ మీడియాపై వర్క్ ఫాన్ ‘‘భఆరత్ ఇన్ఊటిఊ సంవాద్’’ ని ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువతో ప్రతి 20 మంది 15 మందికి స్మార్ట్ ఫోన్ ఉంటుందని పేర్కొన్నారు. వారి చేతల్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియాను ఉపయోగించి అనేక విధాలుగా పోస్టులు చేసి, వారి ఫ్రెండ్స్ చేసిన పోస్టులకు కామెంట్లు, షేర్ లు లైకులు చేసి ఆకట్టుకుంటారన్నారు. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించేవారు 35 సంవత్సరాల్లోపు వారే అధికంగా ఉన్నారన్నారు. రాజకీయ, సామాజిక మార్పులకు సోషల్ మీడియానే ప్రధాన కారణమని చెప్పారు. రోజు రోజుకు సోషల్ మీడియాను వాడే వారి సంఖ్య అధికంగా పెరిగిపోయిందన్నారు.
ఈ సందర్బంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వారి అన్యాయాలకు అడ్డకట్ట వేసేందుకు ప్రధాన ప్రాత్ర పోషిస్తుందన్నారు. డిజిటల్ ఇండియా ద్వారా వైఫైని మరో రెండు సంవత్సరాలలో మన దేశంలో పల్లె పల్లెల్లో రావడానికి నరేంద్రమోడీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్పీకర్లు శ్రీనివాస్ రెడ్డి, శైలేష్ రెడ్డి, రేేకా సుధాకర్, కపికర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment