All meadia

 

Tuesday, 7 October 2014

XI metropolis world congress


ప‌ద‌కొండ‌వ మెట్రోపోలిస్ స‌ద‌స్సును లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. ప్ర‌పంచ న‌గ‌రాలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప్రారంభోత్స‌వ స‌మావేశంలో ప్ర‌స్తావించారు. ఈ స‌ద‌స్సు ద్వారా న‌గ‌రాల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు వెతక‌డానికి ఈ వేదిక ఉప‌యోగ‌ప‌డాల‌న్నారు. 

 మెట్రోపోలిస్ అంత‌ర్జాతీయ స‌ద్సును గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు లాంచ‌నంగా ప్రారంభించారు. సిటీస్ ఫ‌ర్ ఆల్ అనే ప్ర‌ధాన అంశంతో ఈ రోజు మెట్రోపోలిస్ స‌ద‌స్సు ప్రారంభ‌మైంది.  మురికివాడ‌లు, కనీస మౌలిక స‌దుపాయ‌లు లేక‌పోవ‌డం, గ్రామాల నుంచి బ‌తుకు దెరువు కోసం న‌గ‌రాల బాట ప‌ట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దేశంలో 32 శాతం జ‌నాభా న‌గ‌రాల్లో నివ‌సిస్తుండ‌గా, ప్ర‌పంచం మొత్తంలో 54శాతం న‌గ‌రాల్లో నివ‌సిస్తుంది. అయితే ప‌ట్ట‌ణ జ‌నాభా పెరుగుతున్న‌ప్ప‌టికీ అందుకు త‌గ్గ మౌళిక వ‌స‌తులు పెర‌గ‌డం లేద‌ని స‌దస్సులోని వ‌క్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

 ఈ వేదిక ద్వారా ప్ర‌పంచ మేథావుల ఆలోచ‌న‌లు, ఐడియాల‌ను పంచుకోవ‌డానికి ఈ వేదిక ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ స‌ద‌స్సు లో తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఒక పుస్త‌క రూపంలో తీసుకువ‌స్తే స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. న‌గ‌రాల్లో శాటిలైట్ టౌన్ షిప్ ల అభివృద్ది, మెట్రోపోలిస్ న‌గ‌రాల్లో ప్ర‌జ‌ల‌కు హెల్త్ కేర్ అంద‌క‌పోవ‌డం, న‌గ‌రాల్లో మంచినీటి స‌మ‌స్య రోజు రోజుకు పెరుగుతుంది. కాని హైద‌రాబాద్ తో పాటు రాష్ట్రంలో వాట‌ర్ గ్రిడ్ ను ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు మంచి నీరు అందించ‌డంలో ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. కాంక్రిట్ జంగ‌ల్ గా మారుతున్న న‌గ‌రాల్లో వ‌ర్ష‌పునీటి సంర‌క్ష‌ణ‌, సౌర‌శ‌క్తిని ఏర్పాటు చేసిన భ‌వ‌నాల‌కు మాత్ర‌మే అనుమ‌తులిచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు గ‌వ‌ర్న‌ర్‌. పెరుగుత‌న్న జ‌నాభాకు అనుగునంగా ప్ర‌జా ర‌వాణా పెర‌గ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల‌కు అనుగునంగా ప్ర‌జా ర‌వాణా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ విష‌యంలో బార్సిలోనా ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు. 


ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్శించ‌డంలో హైద‌రాబాద్ ముందుంది. న‌గ‌రాల్లో ప్ర‌జ‌లు సౌక‌ర్య‌వంతంగా జీవించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పైన ప్ర‌భుత్వంతో పాటు, ప్ర‌జ‌లు కూడా భాగ‌స్వామం కావాల‌న్నారు కేంద్ర ప‌ట్ట‌ణాభ‌వృద్ది శాఖా మంత్రి వెంక‌య్య‌నాయుడు. గ్రామాల నుంచి ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స‌లు పెరుగుతూ రోడ్ల పై వ్యాపారాలు సాగిస్తున్న వారికి కేంద్రం అండ‌గా ఉంటుంది, వారికోసం స్ట్రీట్ వెండ‌రింగ్ యాక్ట్ ను త్వ‌ర‌లోనే తీసుకు రానున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌ధాని విజ‌న్ లో భాగంగా ఇండ్లు, ప్ర‌తి ఇంటికి మంచినీరు, క‌రెంట్ ను 2022 సంవ‌త్స‌రానికి అందించ‌నున్నామ‌న్నారు. అయితే ఈ రోజు చ‌ర్చ జ‌రుగుతున్న సిటీస్ ఫ‌ర్ ఆల్ అనే అంశం ఒక చాలెంజ్ తో కూడుకున్న‌ది. దీన్ని అధిగ‌మించాలంటే విద్య‌, వైద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌళిక స‌దుపాయాలు అవ‌స‌ర‌మ‌న్నారు కేంద్ర మంత్రి. హైద‌రాబాద్ ను స్మార్ట్ సిటీని చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున త‌మ స‌హ‌కారం ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. 

వెంక‌య్య‌నాయుడు, కేంద్ర ప‌ట్ట‌నాభివృద్ది శాఖా మంత్రి

 తెలంగాణా రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు హైద‌రాబాద్ వేదిక కావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు ముఖ్య‌మంత్రి కెసిఆర్‌. హైద‌రాబాద్ చారిత్రాత్మ‌క న‌గ‌ర‌మైన‌ప్ప‌టికీ పెరుగుత‌న్న టెక్నాల‌జీకి అనుగుణంగా అభివృద్ది చెందుతుంద‌న్నారు. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌, స్మార్ట్ సిటీగా మార్చ‌డానికి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌న్న కేంద్ర ప్ర‌భుత్వానికి సిఎం కృత‌జ్న‌త‌లు తెలిపారు.

 కెసిఆర్‌, ముఖ్య‌మంత్రి

ఎండ్ వాయిస్‌..... న‌గ‌రాల్లో శానిటేష‌న్‌, ప్ర‌జారోగ్యం, ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌లు మెరుగుప‌ర‌డంపై ప్ర‌తినిధులు చ‌ర్చించారు. ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను పెంచి న‌గ‌రాల్లో కాలుష్యాన్ని త‌గ్గించ‌డం, గ్రీన్ సిటీగా మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు విదేశీ ప్ర‌తినిదులు.

No comments:

Post a Comment