All meadia

 

Thursday, 9 October 2014

21వ శతాబ్దం నగరాలదేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

21వ శతాబ్దం నగరాలదేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రపంచ
జనాభాలో సగం వరకు పట్టణాల్లోనే నివసిస్తున్నారని.. ఉత్తమ నగర

పాలక వ్యవస్థలను రూపొందించడం ద్వారానే పౌరులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు
కల్పించగలమని రాష్ట్రపతి అన్నారు. వివిధ నగరాల

అనుభవాలు పరస్పరం పంచుకోవడం ద్వారా మెట్రోపొలిస్ వంటి సదస్సులు మెరుగైన
నగర పాలన కల్పించడంలో ఉపయోగపడతాయని

ఆయన అభిప్రాయపడ్డారు. 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ ముగింపు
సదస్సులో పాల్గొన్న ఆయన నిర్వాహకులను అభినందించారు.

నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను అందరూ ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలని
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 11వ మెట్రోపొలిస్

వరల్డ్ కాంగ్రెస్ ముగింపు సమావేశంలో పాల్గొన్న ఆయన నగర జీవనంలో సమయం ఎంతో
విలువైనదని, ఆ సమయం ఆదా చేసుకోవాడనికి

అవకాశం కల్పించాలని సూచించారు. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఇది
సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు

హైదరాబాద్ మెట్రోను ఒక ఊదాహరణగా ఆయన సూచించారు. నగరాలకు వలసలు
పెరుగుతున్న నేపథ్యంలో నగర పౌరులకు కనీస

సదుపాయాలు కల్పించడం ఒక సవాలని ఆయనన్నారు. నగరాల్లో ప్రజలు ప్రధానంగా
నీటి కొరత ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందుకు నగర

పాలక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో పర్యావరణ
మార్పులు, కర్బన ఉద్గారాల నివారణ,

పర్యావరణహిత భవనాల నిర్మాణం వంటివి కూడా ప్రాధాన్యాంశాలని ప్రణబ్ పేర్కొన్నారు.

స్వచ్ఛ భారత్ గురించి ప్రసంగంలో ప్రస్తావించిన ప్రణబ్ ముఖర్జీ.. నగరాల్లో
చెత్తను డంప్ చేయడం బదులు.. ప్రాసెస్ చేయాలని పిలుపునిచ్చారు.

చెత్తను ఇంధనవనరులుగా మల్చుకునే పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని
సూచించారు. పెరుగుతున్న జనాభాకు నివాస గృహాలను కల్పించడం

సవాల్ అని.. శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం ద్వారా దీన్ని అధిగమించవచ్చని
ప్రణబ్ సూచించారు. శాంతిభద్రతల పరంగా సురక్షిత నగరాలుగా

మార్చాల్సిన బాధ్యత నగర పాలక సంస్థలు, పోలీసులపై ఉందని, ప్రజలు కూడా
బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

ఇస్తాంబుల్ తరహాలో హైదరాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూ నగరాన్ని
అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అభివృద్ధిలో మానవీయ
కోణంతోపాటు పర్యావరణహితాన్ని దృష్టిలో పెట్టుకుంటామని కేసీఆర్

అన్నారు. పట్టణాల్లో భూములను సద్వినియోగం చేసుకోడానికి కృషి చేస్తామని
ఆయనన్నారు. మురికివాడలు లేని ప్రపంచస్థాయి నగరాలుగా

తీర్చిదిద్దాలని ఆయనన్నారు.

కొత్త రాష్ట్రం తెలంగాణాలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును
విజయవంతం చేసిన మెట్రోపొలిస్ నిర్వాహకులు, తెలంగాణా రాష్ట్ర

ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ప్రణబ్ అభినందించారు. పరస్పర అభిప్రాయాలు,
అనుభవాలు పంచుకోవడం ద్వారా ఈ సదస్సు అందరికీ

ఉపయోగపడిందని అన్నారు. నాలుగురోజులుగా జరిగిన ఈ సదస్సులో 66దేశాలకు
చెందిన ప్రతినిధులు పాల్గొన్నార

No comments:

Post a Comment