నగర సమస్యలు.. వాటి పరిష్కారమే ప్రధాన ఎజెండాగా నిర్వహించిన
మెట్రొపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు ముగిసింది. నాలుగు రోజులపాటు
నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ముగింపు వేడుకలకు రాష్ట్రపతి
ప్రణబ్ ముఖర్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన
ప్రతినిధులు, మేయర్లు హాజరై.. మెట్రో నగరాల అభివృద్ధికి సలహాలు
సూచనలు అందజేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా
తీర్చిదిద్దమడమే లక్ష్యమని ప్రకటిస్తున్న టీసర్కార్.. పలు
అంతర్జాతీయ నగరాలతో పరస్పర ఒప్పందాలు చేసుకుంది.
మహానగరాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై
చర్చించేందుకు ఉద్దేశించిన మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సులో మేథోమధనం
జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న
మొదటి అంతర్జాతీయ సదస్సు కావడంతో ప్రభుత్వం ప్రటిష్టాత్మకంగా
తీసుకుంది. సదస్సును గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ లాంచనంగా
ప్రారంభించగా... ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని వివిధ నగరాలకు చెందిన 1700 మంది
ప్రతినిధులతోపాటు విదేశాలకు చెందిన సుమారు 300 మంది మేయర్లు, డెలిగేట్స్
పాల్గొన్నారు.
తొలిరోజు వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ అంశంపై నిర్వహించిన సదస్సులో
నగరాల్లోని మురికివాడల దుర్భర పరిస్థితులు వారు ఎదుర్కుంటున్న
సమస్యలపై ప్రసంగించారు. తమకు ఇళ్లు, తాగునీరు, మరుగుదొడ్లువంటి
సదుపాయాలు లేకపోవడాన్ని ప్రశ్నించారు. పారిశుధ్య నిర్వహణ, ఆటస్థలాలు
లేకపోవడం, రోడ్లపై ప్రాణాంతకంగా వేలాడే విద్యుత్ తీగలు,
ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాల్లో రక్షణ చర్యలు లేకపోవడం వంటి అంశాలను
ప్రస్తావించారు. మురికివాడల్లోకి అంబులెన్స్‌లు త్వరితంగా వెళ్లేందుకు
వీల్లేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు
రూపొందించేటప్పుడు బాలల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడాన్ని
తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. బాలల అభిప్రాయాలతో ప్రభుత్వాలు తగిన
పాలసీలు రూపొందించే అవకాశముందన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్
తెలిపారు. సెషన్‌లో పాల్గొన్న బాలల్లో హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్,
ముంబైకి చెందిన కాజల్ ఖురానా, ఢిల్లీకి చెందిన మాలతీయాదవ్ ఉన్నారు.
సదస్సును అధికారికంగా ప్రారంభించిన గవర్నర్, సీఎం కేసీఆర్..
మైదరాబాద్ చారిత్రాత్మకత చాటుతూ ప్రసంగించారు. అంతర్హైజాతీయ
సదస్సుకు హైదరాబాద్ వేదికగా కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం
కేసీఆర్. హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌సిటీ గా
మారుస్తామన్నారు సీఎం.
...
ఈ వేదిక ద్వారా ప్రపంచ మేథావుల ఆలోచనలు, ఐడియాలను పంచుకోవడానికి ఈ
వేదిక ఉపయోగపడుతుందని రాష్ట్ర గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సదస్సు లో తీసుకున్న నిర్ణయాలను ఒక పుస్తక రూపంలో తీసుకువస్తే
సమాజానికి ఉపయోగపడుతుందన్నారు. నగరాల్లో శాటిలైట్ టౌన్ షిప్ ల
అభివృద్ది, మెట్రోపోలిస్ నగరాల్లో ప్రజలకు హెల్త్ కేర్
అందకపోవడం, నగరాల్లో మంచినీటి సమస్యలను ప్రస్తావించారు.
కాంక్రిట్ జంగల్ గా మారుతున్న నగరాల్లో వర్షపునీటి సంరక్షణ,
సౌరశక్తిని ఏర్పాటు చేసిన భవనాలకు మాత్రమే అనుమతులిచ్చే విధంగా
చర్యలు తీసుకోవాలని సూచించారు గవర్నర్.
ప్రపంచ దృష్టిని ఆకర్శించడంలో హైదరాబాద్ ముందుందని.. నగరాల్లో
ప్రజలు సౌకర్యవంతంగా జీవించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన
ప్రభుత్వంతో పాటు, ప్రజలు కూడా భాగస్వామం కావాలన్నారు కేంద్ర
పట్టణాభవృద్ది శాఖా మంత్రి వెంకయ్యనాయుడు. గ్రామాల నుంచి
పట్టణాలకు వలసలు పెరుగుతూ రోడ్ల పై వ్యాపారాలు సాగిస్తున్న వారికి
కేంద్రం అండగా ఉంటుందన్నారు, వారికోసం స్ట్రీట్ వెండరింగ్ యాక్ట్ ను
త్వరలోనే తీసుకు రానున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ ను స్మార్ట్
సిటీని చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరపున తమ సహకారం ఉంటుందని
హామీ ఇచ్చారు.
వెంకయ్యనాయుడు, కేంద్ర పట్టనాభివృద్ది శాఖా మంత్రి
మంచి నాగరికత, ఆరోగ్యవంతమైన జీవనం ఉన్న నగరాలు కావాలని సూచించారు మాజీ
రాష్ట్రపతి అబ్దుల్‌కలాం. డే-1 సెషన్‌లో భాగంగా అందరి కోసం నగరాలు..
ప్రజల కోసం, ప్రజల చేత.. ప్రజల నగరాలు' అనే అంశంపై అబ్దుల్ కలాం
కీలకోపన్యాసం చేశారు. సహజసిద్ధమైన వాతావరణంతో కూడిన నగరాలు ఏర్పడాలని
ఆకాంక్షించారు. కాలుష్య రహిత, సహజవనరుల వినియోగంతో కూడిన నగర జీవనం
ఆహ్లాదాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. మన దేశంలో చండీగఢ్‌ను
ప్రణాళికాబద్దంగా నిర్మించారని చెప్పారు. ఇలాంటి నగరాల వల్ల నాగరికత
పరిఢవిల్లుతుందన్నారు.
డిజిటల్ హైదరాబాద్, డిజిటల్ తెలంగాణా కోసం ప్రణాళికలు సిద్ధం
చేస్తున్నామన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. మెట్రో పోలీస్ మూడో రోజు సదస్సులో
ముఖ్యఅతిధిగా పాల్గొన్నకేటీఆర్... సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం
చేసుకుంటూ ఉత్తమ పరిపాలన అందించడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లో ఎన్ని సవాళ్లున్నాయో.. అంతకంటే ఎక్కువ అవకాశాలూ ఉన్నాయని
కేటీఆర్ అన్నారు. తాజాగా తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే
గురించి ఈ సదస్సులో ప్రస్తావించారు. గ్రామీణ స్థాయి నుంచి మెట్రో నగరాల
వరకు అభివృద్ధిలో సమగ్ర, కచ్చితమైన సమాచారం అవసరమని తెలిపారు. ఇందుకోసమే
తాము సమగ్ర సర్వే జరిపి బిగ్-డాటా సేకరించామని వివరించారు. స్మార్ట్
సిటీస్ అంటే.. స్మార్ట్ సిటిజన్ సర్వీసెస్ అందించేదే స్మార్ట్ సిటీ అని
పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలో ఉత్తమ నైపుణ్యం కల్గిన మానవ వనరులు,
నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగేలా స్మార్ట్ సిటీస్
ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కేటీఆర్, ఐటీ మంత్రి
సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌పై సిటీ పోలీస్ కమిషనర్
మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజంటేషన్
ఇచ్చారు. ఇటీవల నగరంలోని పలుచోట్ల నిర్వహించిన కార్డన్ సర్చ్‌ను
కూడా ప్రస్తావించారు. పట్టణ జీవన విధానంలో క్రీడల ప్రాధాన్యత
అంశంపై బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల ప్రసంగించారు. అలాగే అర్బన్
పూర్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ, అర్బన్ మొబిలిటీ, గ్రీన్‌బిల్డింగ్స్
టూవర్డ్స్ సస్టేయినబుల్ సిటీస్, హెల్తీ పీపుల్ అండ్ హెల్తీ సిటీస్,
స్మార్ట్ సిటీస్ నిర్మాణంలో సమష్టి కృషి వంటి అంశాలపై విదేశీ
ప్రతినిధులు ఆసక్తికర చర్చలు జరిపారు.
హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, హౌసింగ్, శానిటేషన్‌పై విదేశీ
మేయర్లతో ఐటీ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్
సోమేష్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులు చర్చించారు. పారిస్, బెర్లిన్,
ఇరాన్, సోఫోలో, బార్సిలోనా, టెహరాన్, జొహనెస్‌బర్గ్ నగరాలతో
పరస్పర ఒప్పందాలలు కుదుర్చుకుంది టీ సర్కార్.
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరుగుతున్న మొదటి అంతర్జాతీయ సదస్సు
కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీసర్కార్, జీహెచ్ఎంసీ..
సదస్సు వేదికగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ నగరాలతో
రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలతో కూడిన ఒప్పందాలను చేసుకుంది. ఐతే..
భవిష్యత్తులో వీటన్నింటిని ఏవిధంగా అమలు చేసి... హైదరాబాద్ బ్రాండ్
ఇమేజ్ ఏ మేర పెంచుతుందో వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment