All meadia

 

Friday, 10 October 2014

హైదరాబాద్ లో ఎయిర్ టెల్ వైఫై సేవలు ప్రారంభించిన కేటీఆర్....

స్మార్ట్ ఫోన్ వాడేవారికి మంచి అవకాశం... 
వైఫై ఉంటే అన్ని ఉచితంగానే చూసుకోవచ్చు...
ఇంట్లోనే ఉంటూ షాపింగ్ నుంచి రీచార్జ్ వరకు అన్ని ఆన్ లైన్ లోనే.... 
ఎయిర్ టెల్ వైఫై ని ప్రారంభిస్తున్న కేటీఆర్... 
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;   వైఫై ఉంటే చాలు ఇంట్లోనే ఉంటూ షాపింగ్ నుంచి రీచార్జీ వకు అన్ని ఆన్ లైన్  లోనే చూసుకోచ్చని తెలంగాణ పంచాయితీ, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు.  శుక్రవారం బేగంపేటలోని తాజ్ వివంతాలోని విలేకరుల సమావేశంలో  ఎయిర్ టెల్ ప్రతినిధులు సీఈవో వెంకటేశ్ విజయరాఘవన్, భారతిలు కేటీఆర్ కు స్వాగతం పలికారు. వైఫై ఎయిర్ టెల్ కంపెనీ గ్లోబల్ స్మార్ట్ సిటి పేరుతో ప్రారంభించారు.  ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి శుభవార్త, ఇంటర్నెట్ సేవలు ఉచితంగా అందుబాటులోకి రావడం గర్వించగల విషయమన్నారు. స్మార్ట్ ఫోన్ లో వైఫై రావడంతో ప్రతి ఒక్కరికి మంచి అవకాశంగా భావించాలన్నారు. కొన్ని పనులు ఇంట్లోనే కూర్చొని పని చేసుకోవచ్చన్నారు. ఎయిర్ టెల్ సీఈవో మాట్లాడుతూ ఒక రోజుకు 750 ఎంబి వరకు ఒక యూజర్ ఉపయోగించుకోవచ్చన్నారు. ఇది అందుబాటులోకి  త్వరలో రాబోతుందన్నారు. దీనికి హైదరాబాద్ లో 17 వేరువేరు స్థలాలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వైఫైని వినియోగించుకునేవారికి పబ్లిక్ వైఫై అని ఉంటుంది... దానిని స్విచ్ ఆన్ చేస్తే ఎనేబుల్ డివైజ్ లో ఉన్నట్లయితే వైఫై వస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి తోడు వన్ టైం పాస్ వర్డ్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. మన ఫోన్ నెంబర్ కు పాస్ వర్డ్ వస్తుంది అప్పుడే యూజ్ చేసుకోవచ్చన్నారు. 



No comments:

Post a Comment