సాప్ట్ వేర్ రంగంలో రాణించాలంటే ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ స్కిల్స్ తప్పనిసరి..
ఐటీ రంగంలో మంచి భవిష్యత్ ఉంది; రమేష్ లోకథాన్..
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; కంప్యూటర్ సొసైటి ఆఫ్ ఇండియా (సిఎస్ఐ) ఆధ్వర్యంలో సిఎస్ఐ గోల్డెన్ జూబ్లీ 2014 పేరుతో సమావేశాన్ని బేగంపేటలోని హరిత ప్లజా హోటల్లో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రమేష్ లోకనాథన్ పాల్గొని ప్రసంగించారు. కంప్యూటర్ టెక్నాలజిలో మంచి భవిష్యత్ ఉందని ఆయన అన్నారు. సాప్ట్ వేర్ రంగంలో విద్యార్థులు రాణించాలంటే ముందుగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామ గ్రామాల నుంచి విద్యార్థులకు ఐటి పైన అవగాహన కల్పించాలని తెలిపారు. ఇటీవల నిర్వహించిన డిజిటల్ ఇండియాకు మంచి పేరు వచ్చిందన్నారు. ఈ కాలంలో ఇంటర్నెట్ పైన అవగాహన లేనివారంటే ఎవరూ లేరన్నారు. స్మార్ట్ ఫోన్ ను ఆధారంగా చేసుకొని ప్రతి ఇంటికో ఫోన్ ఉందని తెలిపారు. ఐదు వందల నుంచి ఆరు వందల వరకు విద్యార్థులకు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. చాలా మంది యువత సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతున్నారన్నారు. యువతకూడా ఐటీని దృష్టిలో పెట్టుకొని అది ఒక చాలెంజ్ గా తీసుకొని వర్క్ చేయాలని తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ రామేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణ స్టూడెంట్స్ కు ప్రతి సంవత్సరం 60 వేల మంది చదువుకుంటే వారిలో 20 వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు సంపాదిస్తున్నారన్నారు. కాలేజీలలో చాలా సమస్యలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ అకాడమిక్ స్కిల్స్ పేరుతో తాము విద్యార్థులను దృష్టలో ఉంచుకొని వెబ్ సైట్ ను కూడా రూపొందించామని తెలిపారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. డిజిటల్ తెలంగాణగా మార్చేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో రాజీవ్ శర్మ ఐఏఎస్, హరినాథ్ సింగ్, అవినాష్ చాందర్ తదితరులు పాల్గొన్నారు.

Mallesh.G
Email Id.telanganawebnews@gmail.com
Phone No.7306373354

No comments:
Post a Comment