తెలంగాణ, వెబ్ న్యూస్; హైదరాబాద్; కొత్తగా వ్యాపారం చేసుకునే వారికోసం చిన్న తరహా పరిశ్రమలకు చెందిన వారికి అవకాశంగా ఎలాంటి ఫీజులు లేకుండా స్టార్టప్ ను ఎలా నిర్వహించాలి అనేదాని ఈ నెల 18, 19 తేదీలలో కుషాయిగూడలో సదస్సు నిర్వహిస్తున్నట్లు అరవింద్ పట్వారి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్ఎంఈ ఎక్స్ పో 2014 నిర్వహిస్తున్నట్లు సోమాజిగూడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ వేడుకలకు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, వివిధ బ్యాంకుల సిబ్బంది, కొత్తగా వ్యాపారాలు నిర్వహించుకునే వారు పాల్గొంటారని తెలిపారు. ఇందులో పాల్గొనదలచిన వారికి ఉచితంగా ఎంట్రీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి, గోపాల్, సుధాకర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment