All meadia

 

Tuesday, 1 July 2014

అత్యంత వైభవంగా బల్కపేట ఎల్లమ్మ కళ్యాణం

అత్యంత వైభవంగా బల్కపేట ఎల్లమ్మ కళ్యాణం 
-అమ్మవారి కలయ్ననికి హాజరైన హోం మంత్రి నాయిని, మంత్రి పద్మారావు లు 
-శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో దద్దరిల్లిన బల్కంపేట 
-ఎర్పట్లని పరిశీలించిన  ఎమ్మెల్యే తలసాని...
 తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా మంగళవారం  చూడ ముచ్చటగా జరిగింది. ఉదయం 11 గంటలకు వేద పండితుల మద్య 11:58 నిమిషాలకు   అంగరంగ వైభవంగా నిర్వహించామని ఆలయ నిర్వాహకులు రఘునందన్ తెలుపారు. అమ్మవారి పట్టు వస్త్రాలను ఆలయం నుంచి తెసుకు వచ్చి సనత్ నగర్ ఎమ్మెల్య  తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు సమర్పించారు. అడుగడుగునా  గట్టి పోలీస్ బందోబస్తు చర్యలు తీసుకున్నారు. అమ్మవారి కళ్యాణం అనంతరం అమ్మవారి లడ్డు రూ. 2,81,500 ఎస్సార్ నగర్ కు చెందిన గందారి రమలక్ష్మి దక్కించుకుంది.ఈ కళ్యాణోత్సవానికి తెలంగాణ హోం మంత్రి నాయిని, మంత్రి పద్మారావులు, బండారు దత్తాత్రేయ, అచ్చంపేట ఎమ్మెల్య బాలరాజు తో  ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట కార్పోరేటర్ శేషుకుమారి, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
 అమ్మవారికి వస్త్రాలు తీసుకు వెళ్తున్న ఎమ్మెల్యే తలసాని, శేషుకుమారి 
అమ్మవారి కల్యాణానికి హాజరైన సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ
అమ్మవారి లడ్డు 2,81,500 లక్షలకు ఎస్సార్ నగర్ కు చెందిన గందారి రమలక్ష్మిదక్కించుకుంది


అమ్మవారి కల్యాణానికి పోటెత్తిన భక్తులు
తెలంగాణ హోం మంత్రి నాయిని, మంత్రి పద్మారావు,
తెలంగాణ హోం మంత్రి నాయిని
సనత్ నగర్ ఎమ్మెల్య  తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు

No comments:

Post a Comment