మృతి చెందిన విద్యార్థులకు ఆత్మశాంతి చేకూరాలని సనత్ నగర్ టీఆర్ఎస్ ఇన్ చార్జీ దండె విఠల్ ఆద్వర్యంలో అమీర్ పేట ప్రాంతాల్లో విద్యార్థలచే ర్యాలీ నిర్వహించారు...
రైలు ఢీ కన్న సంఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
-----------సనత్ నగర్ ఇన్ చార్జీ దండె విఠల్...
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; పాఠశాల బస్సును రైలు ఢీ కొన్న సంఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సనత్ నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ చార్జీ దండె విఠల్ అన్నారు. మెదక్ జిల్లాలోని ముసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద బస్సును రైలు ఢీ కొట్టడంతో 16 మంది విద్యార్థులు మృతి చెందడం పట్ల టీఆర్ఎస్ ఇంచార్జి దండె విఠల్ ఆద్వర్యంలో సత్యం థియేటర్ నుంచి ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వరకు వందలాది మంది విద్యార్థులతో శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనపై రైల్వే శాఖ పూర్తి బాధ్యత వహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరి రూ. 5 లక్షల చొప్పన ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తే, కేంద్ర ప్రభుత్వం మాత్రం 2 లక్షల చొప్పున ప్రకటించడం ఎంతో హీనమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు...

No comments:
Post a Comment