హైదరాబాద్ లో 200మిలియన్ డాలర్లతో ఢిఈ షా కంపెనీ పెట్టుబడి- ఐటి మరియు పంచాయితీరాజ్ మంత్రి కె.తారక రామా రావు
Ø అమెరికాలో రెండోరోజు డీఈషా, మాస్టర్ కార్డ్, కెపియంజి, న్యూసిల్క్ రూట్ సంస్ధల అధ్యక్షులతో భేటీ అయిన మంత్రి
Ø అక్రిసియం పేరిట అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలకి సేవలు అందించనున్న డీఈషా కంపెనీ
Ø ప్రముఖ ఇన్వేస్ట్ మెంట్ కంపెనీ భ్లాక్ స్టోన్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీతో ఉమ్మడి సంస్ధ ఏర్పాటు
Ø టియస్ తో పనిచేంసేందుకు సైబర్ సేక్యూరిటీ రంగంలో మాస్టర్ కార్డు అద్యర్యంలో ప్రయివేటు సంస్ధల కూటమి
Ø తెలంగాణ గుడ్ విల్ అంబాసిడర్ గా అమెరికా మాజీ రాయభారి ప్రాంక్ విన్సర్
Ø వచ్చే ఏడాది హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సుకి నాలెడ్జ్ పార్టనర్ గా ఉండేందు KPMG అంగీకారం
ప్రముఖ ఐటి మరియు పెట్టుడుల సంస్ధ డిఈ షా కంపెనీ 200మిలియన్ డాలర్లను హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తన అమెరికా పర్యటనలో రెండవ రోజు న్యూయార్క్లో ని డిఈ షా మేనేజిండ్ డైరెక్టర్ ఏరిక్ వెప్ సిక్ తో సంస్ధ కేంద్ర కార్యలయంలో సమావేశమయ్యారు. గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీకి ప్రభుత్వం మరింత సాయం అందిస్తుందని, కంపెనీని విస్తరించాలని మంత్రి కోరారు. హైదరాబాద్ లో తమ కంపెనీ భ్లాక్ స్టోన్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీతో కలిసి ఏర్పాటు చేస్తున్న అర్కిసియం అనే సబ్సీడరీ కంపెనీని ద్వార హైదరాబాద్లో 200 వందల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు డిఈ షా గ్రూప్ అంగీకరించింది. అసెట్ మేనేజ్ మెంట్ సంస్ధలకి సాప్ట్ వేర్ సేవలనందించే ఈ నూతన కంపెనీద్వార 400 మంది ఉపాది సామర్ధ్యం ఉంటుంది. రాబోయే మూడు సంవత్సరాల్లో ఇది రెట్టింపు అవుతుంని , హైదరాబాద్లో తమ కంపెనీ త్వరలోనే ప్రారంభమౌతుందని ఢిఈ షా యండి ఏరిక్ వెల్ప్ సిక్ తెలిపారు.
మంత్రి కె.తారకరామా రావు రెండో రోజు పర్యటనలో మరో ప్రముఖ సంస్ధ మాస్టర్ కార్డు సంస్ధ అద్యక్షుడు అజర్ బంగా తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఐటి రంగంలో చేపట్టినన పలు కార్యక్రమాలను అయన అభినందించారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో పలు ప్రయివేట్ సంస్ధలను కలుపుకోని తెలంగాణ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిధ్దంగా ఉన్నామని అజయ్ బంగా తెలిపారు. కేవలం సంస్ధలకి, ప్రభుత్వాలకే కాకుండా కోట్లమంది పౌరులకి సైతం సైబర్ సెక్యూరిటీ సవాలుగా ఉందని, అలాంటి అంశం పై మాస్టర్ కార్డు లాంటి సంస్ధలతో కలసి పని చేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుందని మంత్రి అజయబంగా ప్రతిపాధనకి సానుకూలంగా స్పందించారు.
అంతకు ముందు ఉదయం భారత్ లోని మాజీ అమెరికా రాయబారి , మేథో సంపత్తి హక్కుల రంగంలో ప్రముఖుడైన ప్రాంక్ విన్సర్ తో సమావేశమ్యారు. హైదరాబాద్ లోని చార్రిత్రక కట్టాడా రక్షణ కోసం , డెక్కన్ హెరిటేజ్ పౌండేషన్ పేరుతో సేవలందిస్తున్న విన్సర్ ని తెలంగాణ రాష్ర్టానికి గుడ్ విల్ అంబాసిడర్ గా ఉండాలని మంత్రి కోరారు. ఈ ప్రతిపాధనకి అంగీకరించిన విన్సర్ తెలంగాణ రాష్ర్టాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు సేవలందిస్తానని ప్రాంక్ విన్సర్ తెలిపారు.తనకున్న అంతర్జాతీయ సంబందాలను ఇందుకోసం ఉపయోగిస్తానని హమీ ఇచ్చారు.
ప్రముఖ అర్దిక సంస్ధ KPMG కేంద్ర కార్యలయంలో KPMG సంస్ధల చైర్మన్ జాన్ వేహ్ మేయర్ తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను, అలోచనలను మంత్రి మేయర్ కి వివరించారు. తమ సంస్ధ దేశంలలోనే కాకుండా ప్రపంచంలోనే అనేక ప్రభుత్వాలకి పెట్టుబడుల రంగంలో కలిసి పనిచేస్తుందని, అయిదే తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి పాలసీని ఇప్పటివరకి తాను చూడలేదని జాన్ మేయర్ అన్నారు. వచ్చే ఏడాది పిబ్రవరిలో హైదరారబాద్లో జరగబోయే గ్లోబల్ ఇన్వేస్ట్ మెంట్ సమ్మిట్ గురించి మంత్రి మేయర్ కి వివరించారు. ఈ శిఖరాగ్ర సదస్సుకి నాలెడ్జ్ పార్టనర్ గా ఉండేందు KPMG చైర్మన్ అంగీకరించారు.
ప్రపంచ వ్యాప్తంగా 300 స్టార్టప్ సంస్ధల్లో పెట్టుబడులు పెట్టిన న్యూ సిల్క్ రూట్ కంపెనీ సియివో పారగ్ సక్సెనా కలిసారు. ప్రధాన మంత్రి టాక్స్ పోర్సులో సభ్యుడిగా ఉన్న పరాగ్ సక్సేనా తెలంగాణ ప్రభుత్ చేపట్టిన టి-హబ్ కార్యక్రమాన్ని అభినందించారు. టి-హబ్ అలోచనని మెచ్చుకున్న పరాగ్ సక్సేనా, టి –హబ్ లో మెంటర్ గా ఉండేందుకు ముందుకు వచ్చారు. దీంతో హైదరాబాద్ నగరం భారత దేశ స్టార్ట్ అప్ కాపిటల్ గా మారుతుందని మంత్రి సక్సేనాకి తెలిపారు.
వీటితో పాటు మంత్రి కె.తారక రామారావు UST Global, Merrill Lynch, Citibank, and Water Health లాంటి కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సాయంత్రం న్యూయార్క్ నుంచి బయలు దేరి న్యూజెర్సీలోని ఏన్నారైలతో సమావేశమైన మంత్రి వారికి తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. అంతకు ముందున్యూయార్క్ లో తానా, అటా ప్రతినిధులు మంత్రిని కలిసార.తాన ఏలక్ఠ ప్రెసిడెండ్ సతీష్ వేమన మంత్రి కి స్వాగతం పలికారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. మంత్రి వేంటనే ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు, అర్మూర్ ఏంఏల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.
Friday, 8 May 2015
మంత్రి కెటిఆర్ US పర్యటన వివరాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment