All meadia

 

Wednesday, 6 May 2015

అమెరికాలో ఐటి మంత్రి కెటిఆర్

అమెరికాలో మంత్రి కె.తారక రామా రావుకి ఘనస్వాగతం
• అట్లాంటాలో ఘన స్వాగతం పలికిన ప్రవాస టియారెస్ శాఖ, తెలంగాణ సంస్ధలు
• టిడియఫ్, టాటా, ఆటా ప్రతినిధులు, స్నేహితుల స్వాగతం
• తెలంగాణ సాధనకోసం అమెరికా వదిలిపెట్టిన మంత్రి కె.తారక రామారావు, సూమారు పదేళ్ల తర్వతా అమెరికాలో అడుగు
పదేళ్ల తర్వతా అమెరికాలో  అడుగు పెట్టిన తెలంగాణా ఐటీ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకి ఘన స్వాగతం లభించింది. మంత్రి బుధవారం ఉదయం అమెరికా చేరుకున్నారు.  అట్లాంటాలోని Hartsfield–Jackson అంతర్జాతీయ విమానాశ్రానికి చేరుకున్న మంత్రికి అమెరికాలోని ప్రవాస టియారెస్ నాయకులు పలువురు మంత్రిని సాదరంగా స్వాగతం పలికారు. ప్రవాస తెరాస నాయకులు, కార్యకర్తలతోపాటు  అభిమానులు,  మంత్రి స్నేహితులు  పుష్పగుచ్చాలతో స్వాగతించారు. మంత్రి కె.తారకరామారావు రేపు ఉదయం నుంచి ఉదయం వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారు. వాషింగ్టన్ డిసిలో  భారత రాయభారి అరున్ కె సింగ్ తో కలిసి ప్రత్యేక విందు సమావేశానికి హజరవుతారు.
సూమారు పదేళ్ల తర్వతా అమెరికా వచ్చిన వచ్చానని, రెండువారాల పాటు పలు సమావేశాలతో బిజీగా గడపనున్నట్లు మంత్రి కె.తారకరామా రావు ట్విట్టర్లలో పెర్కోన్నారు. టిడియఫ్, టాటా, ఆటా ప్రతినిధులు, స్నేహితుల స్వాగతం సైతం అట్లాంటా ఏయిర్ పోర్ట్ కి తరలి వచ్చారు. మంత్రి కె.తారకరామారావుకి స్వాగతం పలికినవారిలో శివకుమార్ రామడుగు, అనీల్ బోడిరెడ్డి, గౌతం గోలి, పన్నెల జనార్ధన్,  సత్యనారాయణ రెడ్డి, దుర్గం శ్రీనివాస్, చింత రామా, జూపల్లి శ్రీధర్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment