All meadia

 

Thursday, 7 May 2015

అమెరికాలో మంత్రి KTR పర్యటన

ఐటి మరియు పంచాయతిరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు  అమెరికా పర్యటన విజయవంతంగా ప్రారంభం

Ø వాషింగ్టన్ డిసిలో ప్రముఖ కంపెనీలు, ఏన్నారైలతో సమావేశం

Ø తెలంగాణలో పెట్టుబడులపై బోయింగ్ అసక్తి, తర్వలో రాష్ర్టానికి సంస్ధ బృందం

Ø హైదరాబాద్ లో HP సంస్ధ ట్రౌమా కేర్ సెంటర్

Ø తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు,మిషన్ కాకతీయ ఇతర పథకాలను ఏన్నారైలకి వివరించిన మంత్రి

Ø మిషన్ కాకతీయకి వాషింగ్టన్ డిసి ఏన్నారైల 50 వేల డాలర్ల విరాళాలు

Ø కరీంనగర్లో హెల్త్ కేర్ KPO ప్రారంభానికి ముందుకోచ్చిన మరో సంస్ధ

ఐటి మరియు పంచాయతిరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు  అమెరికా పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తోలిరోజు వాషింగ్టన్ డిసిలో జరిగిన పలు సమావేశాల్లో మంత్రి తెలంగాణ రాష్ర్టంలోని పెట్టుబడుల అవకాశాల మీద ప్రసంగించారు. పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమయ్యారు. వాషింగ్టన్ డిసి చేరుకున్న మంత్రి తోలుత        అమెరికాలో భారత రాయబారి  అరుణ్ కుమార్ సింగ్ తో విందు సమావేశంలో పాల్గోన్నారు. US-భారతదేశం బిజినెస్ కౌన్సిల్ (USIBC) సినియర్ ప్రతినిధుల నేతృత్వంలో రాయభారిని కలిసిన మంత్రి, తెలంగాణలో గత పదినెలల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అరున్ కూమార్ సింగ్ తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను , ముఖ్యంగా దేశంలో ఏక్కడా లేని విధంగా రూపోందించిన పారిశ్రామిక పాలసీని అభింనందించారు. ముఖ్యమంత్రికి కె.చంద్రశేఖర్ రావుకి రాష్ర్ట ప్రగతి పట్ల ఉన్న అలోచనలను అయన అభినందించారు.

          భారత రాయభారిని కలిసిన తర్వతా  ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్ధ బోయింగ్ అధ్యక్షుడు, మార్క్ అలెన్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమలు, వాటికున్న మరిన్ని అవకాశాలను మంత్రి కె.తారక రామారావు వివరించారు. తెలంగాణలో ఉన్న ఏరోస్పేస్ అవకాశాలపై మంత్రి ఓక ప్రేజేంటేసన్ ఇచ్చారు.  తామ బోయింగ్ కంపెనీ సైతం భారత దేశంలోని వైమానిక రంగంలో ఉపందుకుంటున్న  ప్రయివేటు పెట్టుబడుల నేపథ్యంలో విమాన తయారీ కేంద్రం ఏర్పాటుకి అలోచిస్తున్నామని బోయింగ్ అద్యక్షుడు అలెన్ తెలిపారు. తెలంగాణలో బోయింగ్  పెట్టుడులపై చర్చించేందుకు హైదరాబాద్ కి తర్వలోనే సంస్ధ సినియర్ ప్రతినిధులను పంపేందుకు నిర్ణయించింది.

          అతర్వతా  ప్రముఖ ఐటి దిగ్గజం హ్యూలెట్ ప్యాకర్డ్ వైస్ ప్రెసిడెండ్ సుపర్ణో  బెనర్జీ తో మంత్రి సమావేశమయ్యారు. సంస్ధ ప్రింటర్ల తయారీ కేంద్రాన్ని హైదరాబరాద్ లో ఏర్పటు చేయాలని కోరారు. దీంతో పాటు కంపెనీ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సీబిలిటీ కింద తెలంగాణలో ఓక ట్రౌమా కేర్ సేంటర్ ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దినికి  HP యాజమాన్యం వేంటనే అంగీకరించింది. తెలంగాణలో ప్రభుత్వ సహకారంలో విద్యా మరియు వైద్యరంగాలతోపాటు ఇతర అనేక రంగాల్లో తమ కంపెనీ ముందుకెళ్లేందుకు సిధ్దంగా ఉందని బేనర్జీ తెలిపారు.

           వీరితో పాటు ఫోర్డ్ మోటార్ కంపెనీ, లాక్హీడ్ మార్టిన్, ఫైజర్, విప్రో మరియు మాస్టర్ కార్డ్ నుంచి సీనియర్ ప్రతినిధులు ఐటి మంత్రి కలుసుకున్నారు.  ఏక్ లాట్ హెల్త్ సొల్యూషన్స్ వైస్-ప్రెసిడెంట్ Mr జెర్రీ జోర్గేన్సేన్ మంత్రిని  కలిసి  అరు నెలల్లో 200 మంది ఉద్యోగులతో  కరీంనగర్లో , ఒక ఆరోగ్య KPO మరియు Analytics కంపెనీ ప్రారంభిస్తామన్నారు.

          సాయంత్రం వాషింగ్టన్ DC ప్రాంతంలో స్థిరపడ్డ  తెలుగు వారు, వృత్తి నిపుణులు ఏన్నారైలు హజరైన సమావేశంలో ప్రసంగించారు. మంత్రి  కె.తారక రామారావు తెలంగాన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మరియు గృహనిర్మాణం  వంటి  ప్రభుత్వ కార్యక్రమాలు గురించి వివరించారు, వారి ప్రభుత్వానికి మద్దతు కోరగా వాషింగ్ టన్ డిసి ఏన్నారైలు 50వేల అమెరికన్ డాలర్ల విరాళాన్ని మిషన్ కాకతీయకిచ్చేందుకు ముందుకు వచ్చారు.

No comments:

Post a Comment