All meadia

 

Saturday, 9 May 2015

MINISTER KTR US visit

డాటా అనాలిటిక్స్ లో ఉపాదికల్పనకి ఇన్ రిథమ్ కంపెనీతో ఓప్పదం, ప్రతి తెలంగాణ ప్రవాస భారతీయుడు గుడ్ విల్ అంబాసిడర్ కావాలి, – పంచాయితీరాజ్ ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు

Ø మూడోరోజు అమెరికా పర్యటనలో మంత్రి

Ø కార్నెగీ మెలాన్ యూనివర్సీటీతో పర్యటన

Ø డాటా అనాలిటిక్స్ లో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభమున్న ఇన్ రిథమ్ కంపెనీతో ఓప్పదం

Ø డాటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీ వంటి రంగాల్లో ఉపాది కల్పన, పరిశోధనలకి ఓప్పందం, నూతన అలోచనలకి ఈ భాగసామ్యం ఉతమిస్తుందన్న మంత్రి

Ø పిట్స్ బర్గ్ లోని ప్రముఖులతో సమావేశం

Ø కె.తారకరామారావు లాంటి నాయకులు దేశాని ప్రధాని కావలని ప్రసంశలు

Ø ప్రపంచం దేశం వైపు చూస్తుందని, ప్రపంచాన్ని తెలంగాణ వైపుచూసేలా చేయడమే తమ లక్ష్యమన్న మంత్రి

Ø ప్రతి తెలంగాణ ఏన్నారై రాష్ర్టానికి గుడ్ అంబాసిడర్ కావలని పిలుపు

Ø తమ సొంత గ్రామాల అభివృ ద్దికి  ప్రభుత్వంలో కలిసి రావాలన్న మంత్రి

Ø పిట్స్ బర్గ్ లోని ఇంక్యూబేటర్ సందర్శన

రెండువారాల అమెరికా పర్యటనలో ఉన్న పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామా రావు మూడోరోజు పర్యటనలో భాగంగా పిట్స్ బర్గ్ లోని కార్నేగీ మెలన్ యూనివర్సటీలో పర్యటించారు. యూనివర్సీటీ అధ్యక్షుడు సుబ్ర సురేష్, మరియు  ప్రోపెసర్ రాజిరెడ్డిలతో సమావేశమయ్యారు. డాటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీ వంటి రంగాల్లో ఉపాది కల్పన కోసం, డాటా అనాలిటిక్స్ లో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభమున్న ఇన్ రిథమ్ కంపెనీతో ఓప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసుకుంది. మంత్రి సమక్షంలో తెలంగాణ ఐటి శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ ఓప్పందంపై సంతకం చేశారు.   ప్రపంచంలోనే సాంకేతిక రంగంలోని పరిశోధనలకి పేరుగాంచిన యూనివర్సీటితో కుదిరిన ఈ భాగసామ్యం వల్ల ఆయా రంగాల్లో పరిశోధనలు, ఏంట్రపెన్యూర్ షిప్  అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి కె.తారకరామారావు అన్నారు. తన రాష్ర్టాన్ని ప్రంపచ స్థాయిలో మార్కెట్ చేయడానికి స్వయంగా వచ్చిన మంత్రిని, ప్రభుత్వ చొరవని యూనివర్సీటీ అధ్యక్షులు అభింనందించారు. ఐటి పరిశ్రమలకి దేశంలోనే ప్రధాన కేంద్రమైన హైదరాబాద్లో , సైబర్ సెక్యూరిటి వంటి అంశాలపై పరిశోదనలు చాల అవసరమని మంత్రి తెలిపారు. అధిశగా ఈ భాగసామ్యం ఉపయోగ పడుతుందన్నారు.  డాటా అనాలిటక్స్ళో లో  ఉద్యగావకాశాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నదని అటువంటి రంగంలో తెలంగాణ ప్రభుత్వంలో ఓప్పదం చేసుకోవడం పట్ల ఇన్ రిథమ్ కంపెనీ అద్యక్షులు వివ్ పెన్నింటి హర్షం వ్యక్తం చేశారు.

ఉమ్మడి రాష్ర్టంలోని ట్రిబుల్ ఐటిలకి, సాకేంతిక విధ్యలో విన్యూత్నమైన మార్పులను అద్యూడైన  సాయంత్ర ప్రో. రాజిరెడ్డి  మంత్రి గౌరవార్ధం  ఇచ్చిన విందు సమావేశంలో పిట్స్ బర్గ్ నగరంలోని ప్రముఖులు పాల్గోన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు,పాలసీలను వివరించిన మంత్రి రాబోయే కాలంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ర్టంగా తెలంగాణని తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం అలోచనలను వివరించారు మంత్రి. మంత్రి కె.తారక రామారావు లాంటి అద్బుత వాక్పటిమా, వివిధ అంశాలమీద విసృతమైన విషయపరిజ్ఘానమున్న  యువనాయకులు దేశ రాజకీయాల్లో ఉండాలని అకాంక్షించారు. ఇంకా రాజకీయాల్లో సుదీర్ఘ భవిష్యత్తున్న మంత్రి దేశ ప్రధాని కావాలని , మంత్రి లాంటి జౌత్సాహిక నాయకత్వం దేశానికి అవసరమన్నారు. 

పిట్స్ బర్గ్ లోని టెక్ షాప్ సందర్శించారు మంత్రి కె.తారక రామారావు.  ఈ టెక్ షాప్ సందర్శన  అనుభవం ఇక్కడ పరిశోధనలకి అందుతున్న సహయం వంటి పలు అంశాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే టిహభ్ కార్యక్రమంలో వినియోగించుకుంటామన్నారు. ఔత్సాహితక పరిశోధనలకి, అండ లభిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయన్న మా విశ్వాసం, అల్ఫాల్యాబ్ గేర్ ని సందర్శనతో నిజమైందన్నారు మంత్రి కె.తారకరామారావు. అక్కడ జరుగుతున్న పలు పరిశోధనా ప్రయోగాలను అయన అడిగి తెలుసుకున్నారు.

తర్వతా సాయంత్రం పిట్స్ బర్గ్ లో ని వేంకటేశ్వర దేవాలయాన్ని సందర్శించిన మంత్రి ఏన్నారైలు సాదర స్వాగతం పలికారు. అతర్వాతా ఏన్నారైలతో సమావేశమైన మంత్రి ప్రపంచం నేడు  భారతదేశం వైపు చూస్తుందని, అయితే ప్రపంచం మెత్తం తెలంగాణ వైపు చూసేలా  చేసేందుకు తెలంగాణని తీర్చిదిదిందుకు తాము ప్రయత్నిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు ఏన్నారైలతో జరిగే సమావేశంలో తెలిపారు. ఇందుకోసం విదేశాల్లోఉన్న తెలంగాణ ఏన్నారైలు తమతో కలిసి రావాలని కోరారు. తెలంగాణ రాష్ర్టానికి,  ప్రతి తెలంగాణ ఏన్నారై ఓక్కో గుడ్ విల్ అంబాసిడర్ గా మారాలని కోరారు. తాము అనేక  రంగాల్లో స్పష్టమైన రోడ్ మ్యాప్ తో ముందుకు వెలుతున్నామని, ప్రజలకి తాగునీరందించేందుకు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, వ్యవసాయాని సాయంమందించేందుకు మిషన్ కాకతీయ, పేదలకి అండగా అసరాగా ఉండేందుకు ఆసరా పించన్లు, గ్రామా అభివృద్ది కోసం పంచాయితీరాజ్ రోడ్ల బలోపేతం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను విద్యుత్ రంగంలో సర్ ప్లస్ రాష్ర్టంగా ఉంచేందుకు  స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెలుతున్నామన్నారు. అందరం కలసి సాధించుకున్న తెలంగాణని అదే ఉద్యమ స్పూర్తితో బంగారు తెలంగాణగా మార్చుకుందామని పిలునిచ్చారు.  తెలంగాణ కోసం ఏన్నారైలు నిర్వర్తించిన పాత్రని గుర్తు చేసిన మంత్రితారక రామారావు, తెలంగాణ అభివృద్దికోసం తమ సొంత గ్రామాల అభివృద్దికోసం ప్రభుత్వంతో పని చేయాలన్నారు.

No comments:

Post a Comment