టి-హబ్ స్టార్ట్ అప్ కంపెనీలకి సిలికాన్ వ్యాలీ సహకారం- తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు
Ø సిలికాన్ వ్యాలీలో మంత్రి రెండో రోజు పర్యటన
Ø ఇన్నో ట్రెక్ సదస్సులో కీలకోపన్యాసం చేసిన మంత్రి
Ø టి-హబ్ తో దేశంలో పరిశొధనలకి ఊతం
Ø టి- స్టార్ట అప్స్ కి సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీల సహకారం కోసం ప్రత్యేక కార్యక్రమం
Ø టి-హబ్ కార్యక్రమానికి సిలికాన్ వ్యాలీ పరిశ్రమల అభినందన
Ø ప్రముఖ చిప్ తయారీ సంస్ధ ఏన్ విడియా కార్పోరేషన్ తో సమావేశమైన మంత్రి
Ø డాటా ప్రాసెంసింగ్ కంపెనీ సాప్ (SAP) తో సమావేశం
Ø కేవియం కంపెనీ సియివోతో సమావేశం
తెలంగాణ రాష్ర్టాన్ని, ఇక్కడి పెట్టుబడుల అవకాశాలను తెలిపేందుకు రెండువారాల పాటు అమెరికాలో పర్యటిస్తున్న పంచాయితీరాజ్ మరియు ఐటి శాక మంత్రి కె .తారక రామా రావు ఏనిమిదవ రోజు పలు ప్రముఖ కంపెనీల సియివోలు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. నాస్కామ్ అద్యర్యంలో ఏర్పాటు చేసిన ఇన్నోట్రెక్ సమావేశంలో మంత్రి ముక్యఅథితిగా హజరయ్యారు. సమావేశంలో ప్రధానోపన్యాసం(key note speaker) చేశారు. ఈ కార్యక్రమం కాలిపోర్నియాలోని పాల్ అట్లో లోని ప్రముఖ అంతర్జాతీయంగా డాటా ప్రాసెసింగ్ లో పేరెన్నికగన్న సాప్ ( SAP campus ) ప్రాంగణంలో జరిగింది.
భారతదేశంలోని అత్యుత్తమ జౌత్సాహిక పరిశోదకులను ఏంచుకుని సిలికాన్ వ్యాలీలోని ప్రసిధ్ద కంపెనీలు, ప్రముఖ పెట్టుబడి దారులతో కలిసి పని చేసేలా రూపోందించిన ఇన్నోట్రెక్ కార్యక్రమం ఓక అద్బుతమైన కార్యక్రమని, దీని వల్ల దేశంలోని పరిశోధనలకి ఉతమిచ్చినట్టు అవుతుందని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంతో సిలికాన్ వ్యాలీలోని పెట్టుబడిదారులు, మెంటార్లు తెలంగాణలో తాము చేపట్టిన ఐటి కార్యక్రమాలను పరిశీలించాలని కోరారు. తాము పరిశోదనలకి ప్రోత్సాహం ఇచ్చేలా చేపడుతున్న టి-హబ్ కార్యక్రమం దేశంలో ఏ రాష్ర్టం భారీ స్దాయిలో చేపట్టడం లేదని, దేశంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని ప్రప్రథమంగా తెలంగాన రాష్ర్టం చేపట్టిందని మంత్రి సమావేశానికి హజరయినవారికి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా కేవలం హైదరాబాద్ లోనే కాకుండా దేశం మెత్తంలోను ఐటి రంగంలో అద్బుతమైన ప్రగతి సాద్యమౌతుందని నమ్ముతున్నట్లు అయన తెలిపారు. టి-హబ్ కార్యక్రమాన్ని అభినందించిన పెట్టుబడి దారులు, టి-హబ్ ద్వారా వచ్చే స్టార్టప్ కంపెనీలకి సిలికాన్ వ్యాలీలో అవకాశం ఇస్తామని హమీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓక కార్యక్రమాన్ని సైతం చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్ ఆట్లో నగరం మేయర్ కరెన్ హోల్మన్, నాస్కామ్ నుంచి బివిఅర్ మెహన్ రెడ్డి, రవిగుర్రాలతో పాటు సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులైన రాజు రెడ్డి, సునీల్ ఏర్రబెల్లి, మాలవల్లి కూమార్, నిశిత్ దేశాయి, మెహన్ ఉత్తర్వర్, పికె గూలాటి, మైక్రోసాప్ట్ వెంచర్ నుంచి రవినారాయాన్, బ్లూమ్ వెంటర్ నుంచి కార్తీక్ రెడ్డి, సంజయ్ నాథన్ లు సమావేశానికి హజరైన వారిలో ఉన్నారు. ఈ సమావేశంతోపాటు కావియమ్ (Cavium) సియివో సయిద్ అలీతో సమావేశమై తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటిలో తీసుకున్న కార్యక్రమాల గురించి వివరించారు.
ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఏన్ విడియా(nvidia) కార్పోరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డెబోరా సి. షోకిస్టు మరియు డ్విట్ డైరెక్స్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఏలక్ర్టానిక్స్ కంపెనీల కోసం చేపట్టనున్న కార్యక్రమాలను, ప్రభుత్వం అందించే సహకారాన్ని వారికి వివరించారు.
Thursday, 14 May 2015
US Tour of IT minister KTR
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment