Sunday, 3 January 2016
WARANGAL Tour schedule of CM K.C.R రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెండు రోజుల పర్యటనకు గాను సోమవారం మధ్యాహ్నం వరంగల్లుకు వస్తునారు.సోమవారం మధ్యాహ్నం 3 గం.లకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 3.55 ని.లకు మడికొండ చేరుకుని కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో యాదగిరిగుట్ట వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంఖుస్థాపన చేస్తారు.అనంతరం కెప్టెన్ లక్ష్మీ కాంతరావు యింటిలో బసచేస్తారు. ఐదో తేదీన ఉదయం 10.30 గం.లకు హనుమకొండ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల చెరుకుని అక్కడనుండి హెలికాప్టర్ ద్వారా చెల్పూర్KTPP చేరుకుని 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 1.30 గం.లకు చెల్పూర్ నుండి హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకుని మేడారం జాతర పై వరంగల్ కలెక్టరేట్ లో జరిగే సమీక్షా సమావేశంలో ఆరు గంటల వరకు పాల్గొంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment