All meadia

 

Wednesday, 6 January 2016

తేది-06-1-2016 పత్రికా ప్రకటన తెలుగు విద్యార్దుల డిపోర్టేషన్ పైన విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ కి మంత్రి కె.తారక రామారావు లేఖ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్దులను వెనక్కి పంపడంపైన (డిపోర్టేషన్) విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ కి పంచాయితీరాజ్, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు లేఖ రాసారు. విద్యార్దుల డిపోర్టేషన్ వలన విద్యార్దుల కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని మంత్రి లేఖలో అవేదన వ్యక్తం చేశారు. చట్టబద్దంగా హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ వారు ఇచ్చిన వీసా, అనుతమతి పత్రాలన్నీ ఉన్న తెలంగాణ విద్యార్దులకి అన్యాయం జరిగిందని లేఖలో పెర్కోన్నారు. హైదరాబాద్ నగరం నుంచే అమెరికాకు అత్యధికంగా విద్యార్దులను, ఉద్యోగులను వెళతారని మంత్రి సుష్మస్వరాజ్ కి మంత్రి గుర్తు చేశారు. అమెరికా విద్య కోసం విద్యార్దులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని , విద్యార్దుల వెనక్కి పంపడంతో వారి కుటుంబాలు ఇప్పుడు తీవ్ర మానసిక, అర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నారని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. విద్యార్దులను వెనక్కి పంపడంతోపాటు అమెరికా అదికారులు విద్యార్దులతో ప్రవర్తించిన తీరుపై వచ్చిన వార్త

No comments:

Post a Comment