పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుకి పారిస్ లో జరిగే ఇండియా ఇన్వేస్ట్ మెంట్ ఫోరమ్ సదస్సుకి అహ్వనం
ఇండియా ఇన్వేస్ట్ మెంట్ ఫోరమ్ 2016కి హజరు కావల్సిందిగా పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుకి అహ్వనం అందింది. ఈనెల 18న ప్రాన్స్ దేశంలోని పారిస్ నగరంలో జరిగే ఈ సమావేశానికి హజరు కావాలని మంత్రిని Chamber of Commerce and Industry France-India(CCIFI) కోరింది. ఈ సమావేశానికి గౌరవ అతిధిగా హజరై కీనోట్ అడ్రస్ (ప్రసంగం) ఇవ్వాలని కోరింది. "Investments & New Growth Drivers" అనే అంశంపైన మాట్లాడాల్సిందిగా కోరారు. ఈ మేరకి Mr. Dan Oiknine, Chairman, CCIFI నుంచి మంత్రికి అహ్వనం అందింది. భారత్, ప్రాన్స్ తోపాటు యూరోపియన్ యూనియన్ లోని ప్రెంచ్ మాట్లాడే దేశాల మద్య వాణిజ్య సంభందాల అభివృద్ది కోసం ఫోరమ్ పనిచేస్తుంది.
ప్రతి ఏటా జరిగే ఈసదస్సుకి అయా దేశాలనుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హజరవుతుంటారు. ఈ సదస్సు భారత దేశ బ్రాండ్ ఇమేజీని ప్రెంచ్ దేశాలకి పరిచయం చేస్తూ...వాణిజ్య సంభందాల అభివృద్దినేపథ్యంలో తెలంగాణ రాష్ర్టంలో అభివృద్ది అవకాశాలను పలు దేశాలకి పరిచయం చేయాలని కోరారు. India Invest Forum సమావేశాన్ని ప్రతిఏటా Chamber of Commerce and Industry France-India (CCIFI), భారత దేశానికి చెందిన Confederation of Indian Industry (CII) తోకలిసి నిర్వహిస్తుంది.
భారత్ –ఫ్రాన్స్ సంభాదాల్లో పబ్లిక్ ప్రయివేట్, ప్రయివేట్ –ప్రయివేట్ వాణిజ్య సంభందాల్లో ఉన్న అవకాశాలను ఈ సమావేశం చర్చిస్తున్నదని, ఇరుదేశాల్లోని పారిశ్రామిక అవకాశాలను పరస్పరం తెలియజేసేందుకు ఉపకరిస్తుందని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. భారతదేశంలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టం పారిశ్రామిక పెట్టుబడులకి అకర్షనీయంగా మారిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పారిశ్రామిక విధానాన్నిప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు మంత్రి తెలిపారు.
Wednesday, 6 January 2016
Invitation to minister KTR
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment