ప్రెస్‌నోట్: 2, 09-12-2015. గ్రేటర్ పరిధిలో టూబెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి గురువారం నాడు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు జరుగనున్నాయి.
రాష్ర్ట ఐటి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే.టి.రామారావుతో సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. గురువారం నాడు జరిగే డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలు ఈ క్రింది ప్రాంతాల్లో మంత్రులు జరుపనున్నారు. 1. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్‌పుర క్రాస్‌రోడ్ కట్టమైసమ్మ సిల్వర్ కంపౌండ్, 2. ముషిరాబాద్ లంబాడి తండా, 3. శ్రీసాయిచరణ్ కాలనీ, 4. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని కాంగారినగర్, 5.మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు, 6. యాకత్‌పుర నియోజకవర్గం సరళాదేవినగర్, 7. చాంద్రాయణగుట్టలోని రియాసత్‌నగర్, 8.జంగంమెట్, 9. మైసారం, 10. చార్మినార్ నియోజకవర్గంలోని పార్థివాడ, ఎస్వీనగర్, 11.నాంపల్లిలోని మంగడి బస్తి, 12.కార్వాన్ నియోజకవర్గంలోని హరిదాసుపురలలో ఈ శంకుస్థాపనలు జరపడానికి జిహెచ్ఎంసి ఏర్పాట్లు పూర్తిచేసింది.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అంగీకరించిన 22బస్తీలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 22నియోజకవర్గాల్లో 47ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి జిహెచ్ఎంసి నిర్ణయించింది. అయితే ముందుగా ఈ 47బస్తీవాసులకు ముందుగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, వాటి వల్ల కలిగే నాణ్యమైన జీవనవిధానం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై స్వచ్ఛంద సంస్థలతో అవగాహన కార్యక్రమాలను కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి ఏర్పాటు చేశారు. గతంలో బస్తీవాసుల అంగీకారం లేకుండా నిర్మించిన రాజీవ్ ఆవాస్ యోజన (రే), జేఎన్‌యూఆర్ఎం పథకాల్లో భాగంగా నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ నిరుపయోగంగా ఉండడానికి ప్రధాన కారణం ఈ ఇళ్ల నిర్మాణంపై లబ్దిదారులకు సరైన అవగాహన లోపమని కమిషనర్ గుర్తించారు. ప్రస్తుతం చేపట్టే డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పై ముందుగా వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సంతృప్తి చెందిన అనంతరమే ఇళ్లను నిర్మించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా 22బస్తీవాసులు లిఖితపూర్వకంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అంగీకరించారు. వీటిలో 17 ప్రాంతాల్లో 9అంతస్తులలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఆయా బస్తీవాసులు అంగీకరించారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ. 6.81లక్షల వ్యయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8,650ఇళ్లను గ్రేటర్ పరిధిలో నిర్మించడానికి ప్రభుత్వం ప్రకటించింది.
----------------------------------------------------------------------------------------
- సిపిఆర్ఓ జిహెచ్ఎంసి చే జారీచేయనైనది.



No comments:
Post a Comment