Model apartment
Thursday, 10 December 2015
"పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించండి: కేటీఆర్" కంటోన్మెంట్‌లోని రసూల్‌పురాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...పేదలందరికీ గూడు కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. హైదరాబాద్‌లో ఈ ఒక్క సంవత్సరంలోనే 10వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. రసూల్‌పురాలో 205 ఇండ్లకు శంకుస్థాపన చేశాం. నాలుగేళ్లలో హైదరాబాద్‌లో లక్షపై చిలుకు ఇండ్లను నిర్మిస్తామన్నారు. లక్షా 8వేల మందికి పట్టాలిచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాం. గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. పాఠశాలల్లో, సంక్షేమహాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడ్తున్నాం. పేదవాడి డబుల్ బెడ్‌రూం ఇండ్ల కలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. పైసా తీసుకోకుండా పేదలకు అన్ని సౌకర్యాలతో ఇళ్లు కట్టిస్తున్నాం. ఈ రోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో 10వేల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. పని చేస్తున్న ప్రభుత్వాన్ని హైదరాబాద్ ప్రజలు ఆదరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment