.
Thursday, 8 October 2015
కాకతీయుల చరిత్ర, రాణి రుద్రమదేవి జీవిత విశేషాలతో కూడిన కథాంశంతో నిర్మించిన 'రుద్రమదేవి' చిత్రానికి వినోద పన్ను మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే ఈ సినిమాకు వినోదపన్ను నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తగిన ప్రోత్సాహం అందించాలనే ప్రభుత్వ విధాన నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రుద్రమదేవి చిత్ర దర్శకుడు గుణశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. 'రుద్రమదేవి' సినిమాను చూడాల్సిందిగా ఆహ్వానించారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రుద్రమదేవి గొప్పతనాన్ని చిత్రీకరించినందుకు దర్శకుడు గుణశేఖర్ ను ముఖ్యమంత్రి అభినందించారు. ఇలాంటి చిత్రాలు మరిన్ని నిర్మించాలని సూచించారు. రాణి రుద్రమదేవిపై చిత్రాన్ని తీయడానికి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పర్యటించానని, చరిత్రను అధ్యయనం చేసి తీశానని గుణశేఖర్ చెప్పా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment