All meadia

 

Friday, 17 July 2015

KTR PRESS MEETING

NABARD MEEt
తెలంగాణ తాగునీటి పథకంలో భాగం అవుతున్నందుకు గర్వంగా ఉం ది- నాబార్డ్

ప్రతిష్టాత్మకమైన తెలంగాణ తాగునీటి పథకంకు ఈ సంవత్సరం 3000 కోట్ల రుణం ఇస్తామని నాబార్డ్ హామి ఇచ్చింది.. ఈ నెలలోనే ఆ మొత్తాన్ని అందిస్తామంది.. ముంబై నుంచి వచ్చిన నాబార్డ్ అధికారుల బృందం పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి  రేమండ్ పీటర్ , ఆర్.డబ్యు.ఎస్.ఎస్ ఇంజనీర్ ఇన్ ఛీప్ సురేందర్ రెడ్డితో సమావేశమైంది.. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పథకం ఆలోచన,అమలు అద్భుతంగా ఉందని నాబార్డ్ అధికారులు ప్రశంసించారు..నిన్న గజ్వెల్ ,సింగూరుతో పాటు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించిన నాబార్డ్ అధికారులు..తమ అనుభవాలను పంచుకున్నారు..పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు..కోట్లాదిమందికి తాగునీటిని అందించే ఈ పథకం కోసం గ్రామీణ తాగునీటి సరాఫరా,పారిశుద్ధ్య శాఖ ఇంజనీర్లు  రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని రేమంట్ పీటర్ చెప్పారు..వాటర్ ప్రాజెక్టును కేంద్రం ప్రశంసించిన తీరుతో పాటు పథకంలో భాగంగా ఆఫ్టిక్ కేబుల్ వైర్ తో ఇంటింటికి ఇంటర్ నెట్ కనెక్షన్ ఇస్తున్నవిషయాలను నాబార్డ్ అధికారులకు  వివరించారు..మొత్తం ప్రాజెక్టులో 10% నీటిని పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించామని, మున్సిపాలిటీలకు శుద్ది చేసిన నీటిని {TREATED WATER } అందిస్తామన్నారు.ఆ తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్రను అధికారులు కలిశారు.ఈ సమావేశంలో ఆర్.డబ్యు.ఎస్అండ్ ఎస్ ఈఎన్ సి సురేందర్ రెడ్డితో పాటు ఆ శాఖ ఇంజనీర్లు, ముంబై నుంచి వచ్చిన నాబార్డ్ అధికారులు సివి రెడ్డి,మిశ్రా తో పాటు హైదరాబాద్ నాబార్డ్ కేంద్ర అధికారులు ఉమేష్ శివ్ డే, హర గోపాల్, సత్యానారాయణ, బక్కారెడ్డి  పాల్గొన్నారు..

No comments:

Post a Comment